TS SSC Results : తెలంగాణలో పదో తరగతి ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి. ఈ ఉదయం పదకొండు గంటలకు విద్యా శాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం( Burra Venkatesham) వీటిని విడుదల చేశారు. ఈ ఫలితాలను చూసుకోవడానికి రాష్ట్ర ఎస్ఎస్సీ బోర్డు అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. ఇక్కడున్న లింక్ని క్లిక్ చేయడం ద్వారా ఫలితాలను నేరుగా చూసుకోవచ్చు.
https://results.bsetelangana.org/
తెలంగాణ(Telangana) పదో తరగతి ఫలితాల(Tenth results) కోసం ఈ లింక్ని క్లిక్ చేసి రోల్ నెంబర్ని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ని కొట్టాలి. అక్కడ మార్కుల వివరాలు వస్తాయి. కావాలనుకుంటే మార్కుల మెమోను అక్కడే ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇక ఫలితాల వివరాల్లోకి వెళితే ఈ ఏడాది టీఎస్ టెన్త్ ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఉత్తీర్ణతలో బాలికలు ముందంజలో ఉన్నారు.
బాలికల ఉత్తీర్ణతా శాతం 93.23 శాతంగా నమోదైంది. బాలుర ఉత్తీర్ణతా శాతం 89.42గా నమోదైంది. మొత్తం 3,927 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. అలాగే ఆరు స్కూళ్లలో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైంది. పదో తరగతి పరీక్షలు రాసేందుకు ఈ ఏడాద మొత్తం 5,05,813 మంది హాజరయ్యారు. వారిలో 4,91,862 మంది ఉత్తీర్ణులయ్యారు.