CBSE: వచ్చే సంవత్సరం నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
వచ్చే ఏడాది నుంచి సంవత్సరానికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనికి అవసరమైన విధివిధానాలను రూపొందించాలని కేంద్ర విద్య మంత్రిత్వ శాఖ.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌ను కోరింది.
CBSE: వచ్చే ఏడాది నుంచి సంవత్సరానికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనికి అవసరమైన విధివిధానాలను రూపొందించాలని కేంద్ర విద్య మంత్రిత్వ శాఖ.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌ను కోరింది. ఏడాదికి రెండుసార్లు పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటుందని, తద్వారా వాళ్లకు మరిన్ని అవకాశాలు, ప్రయోజనాలు అందించడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక గత ఏడాది ఆగస్టులో విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన కొత్త నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్ విద్యార్థులకు సంవత్సరానికి రెండుసార్లు బోర్డు పరీక్షలు రాసే అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించింది.
2025-26 విద్యాసంవత్సరం నుంచి రెండు ఎడిషన్ల బోర్డు పరీక్షలను నిర్వహించాలనే ఆలోచన ఉందని, అయితే విధివిధానాలు ఇంకా రూపొందించాల్సి ఉందన్నారు. అయితే సీబీఎస్ఈ 10, 12వ తరగతి విద్యార్థులకు సంబంధించి బోర్డు కీలక సూచనలు చేసింది. వీళ్లు సంవత్సారానికి రెండుసార్లు బోర్డు పరీక్షలకు హాజరు కావడం తప్పనిసరి కాదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మాదిరిగానే విద్యార్థులు ఏడాదికి రెండుసార్లు 10, 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఆ రెండు పరీక్షలలో వారు దేనిలో ఉత్తమ స్కోరును సాధిస్తే.. దాన్నే ఎంచుకోవచ్చు. అది పూర్తిగా విద్యార్థి ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. రెండుసార్లు పరీక్ష రాయాలనే బలవంతం లేదని తెలిపారు.