»60 Year Old Wins Miss Universe Buenos Aires Beauty Pageant
Miss Universe: 60 ఏళ్ల వయస్సులో మిస్ యూనివర్స్
కృష్ణా రామా అనుకోవాల్సిన వయసులో అందాలో పోటీలో పాల్గోని విజయకేతనం ఎగరవేసిన బామ్మ ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ప్రతిభా ఉంటే చాలు వయస్సుతో సంబంధం లేదు అని నిరుపించింది ఈ ప్రపంచ సుందరి.
60-Year-Old Wins Miss Universe Buenos Aires Beauty Pageant
Miss Universe: అందాల పోటీలో పాల్గొనాలంటే పడుచుదనం ఉండాలన్నా మూస పద్దతిని బద్దలు కొట్టి.. కృష్ణా రామా అనుకోవాల్సిన వయస్సులో అందాలో పోటీలో పాల్గోని విజయం కేతనం ఎగరవేసింది ఓ 60 ఏళ్ల భామ. అర్జెంటీనాకు చెందిన అలెజాండ్రా మారిసా రోడ్రిగ్జ్ బ్యూనస్ ఎయిర్స్ ప్రావిన్స్‌కు మిస్ యూనివర్స్ టైటిల్‌ను కైవసం చేసుకొని చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించింది. తన అంకితభావానికి, తన ప్రతిభకు ఆమె విజయం నిదర్శనం. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ ప్రావిన్స్ రాజధాని లా ప్లాటాలో నివసించే రోడ్రిగ్జ్ వృత్తిరిత్యా న్యాయవాది, అనుభవజ్ఞులైన పాత్రికేయురాలు. అందాలపోటీలలో ప్రజలకు ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ ఇప్పుడు ప్రపంచ సుందరీ కీరిటాన్ని దక్కించుకుంది. 60 ఏళ్ల వయసులో మిస్ యూనివర్స్ కీరిటాన్ని దక్కించుకున్న లేడీగా రికార్డు సృష్టించింది.
అంతేకాదు మిస్ యూనివర్స్ అర్జెంటీనా 2024 మేలో జరగబోయే పోటీకి తాను సిద్దం అవుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. అలాగే మెక్సీకోలో 2024 సెప్టెంబర్ 28న జరగబోయే వేడుకలో సైతం తాను పోటీ చేయనుంది. అందులో సైతం విజయం సాధిస్తుందని ఎంతో విశ్వాసంతో ఉంది. రోడ్రిగ్జ్ స్పందిస్తూ.. అందాల పోటీలో కేవలం శరీరక అందం మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసం ఉండాలని అన్నారు. మిస్ యూనివర్స్ సంస్థ గత సంవత్సరం పోటీలో పాల్గొనేవారికి ఏజ్ లిమిట్ లేదని ప్రకటించింది. ఈ ఏడాది నుంచి 18 ఏళ్లు నిండిన ఏ మహిళ అయినా పోటీలో పాల్గొనవచ్చు. ఇంతకుముందు 18 ఏళ్ల నుంచి 28 వరకు వయసుఅ పరిమితి ఉండేది. ఈమెతో పాటు మరో 47 ఏళ్ల హైడీ క్రజ్ డొమినికన్ రిపబ్లిక్ తరఫున మిస్ యూనివర్స్ 2024 పోటీల్లో పాల్గొననుంది.