Venkatesh Netha : బీజేపీలో చేరిన పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార కాంగ్రెస పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేత సోమవారం బీజేపీలో చేరారు.
Venkatesh Netha : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార కాంగ్రెస పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేత సోమవారం బీజేపీలో చేరారు. బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన కమలం కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్ నేత మాట్లాడుతూ.. రెండు నెలల 23 రోజులుగా తాను అశాంతితో కొట్టు మిట్టడుతున్న సందర్భంలో కిషన్ రెడ్డి బీజేపీలోకి ఆహ్వానించడం తన అదృష్టం అని అన్నారు. మోడీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమన్నారు. బీజేపీ నాయకత్వం ఇచ్చిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేరుస్తానన్నారు.
ఇక, హస్తం పార్టీ నుంచి ఆయన పెద్దపల్లి టికెట్ ఆశించగా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణకు టికెట్ కేటాయించింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎంపీ వెంకటేష్ నేత కొద్ది రోజులకే పార్టీ వీడటం కాంగ్రెస్ కు మైనస్ కానుంది.