థియేటర్లో సో.. సో.. అనిపించుకున్న టైగర్ నాగేశ్వర రావు.. డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో మాత్రం దుమ్ములేపుతోంది. ఏకంగా సూపర్ స్టార్ రజనీ కాంత్ సినిమాను సైతం వెనక్కి నెట్టి టాప్ ప్లేస్‌లో ఉంది.
పోయిన దసరాకు టైగర్ నాగేశ్వర రావు (Tiger NageswaraRao)గా ఆడియన్స్ ముందుకొచ్చాడు మాస్ మహారాజ రవితేజ (Raviteja). రవితేజ చేసిన ఈ ఫస్ట్ పాన్ ఇండియా (Pan India) ప్రాజెక్ట్.. ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ అయిన అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే థియేటర్లో అంతగా ఆదరణకు నోచుకోలేకపోయిన ఈ సినిమా.. ఓటిీటీ (OTT)లో మాత్రం దుమ్ములేపుతోంది. ఏకంగా రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాను (Jailer Movie) వెనక్కినెట్టి.. టైగర్ నాగేశ్వరరావు సరికొత్త రికార్డు క్రియేట్ (Record Create) చేసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించింది.
నవంబర్ 17న సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చి టైగర్ నాగేశ్వరరావు సినిమాకు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ పై అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం నెంబర్ వన్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది టైగర్. ఇక అమెజాన్ ప్రైమ్ (Amazon prime) ప్రకటించిన వివరాల ప్రకారం.. టైగర్ నాగేశ్వరరావు మూవీ నెంబర్ వన్ స్థానంలో ఉండగా.. రెండో ప్లేసులో ‘ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’ మూవీ ఉంది. ఇక మూడో స్థానంలో పిప్పా, నాలుగో స్థానంలో రజనీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ జైలర్.. ఐదో స్థానంలో బాలీవుడ్ మూవీ ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’ ఉంది.
మొత్తంగా తమిళ్, బాలీవుడ్ భారీ హిట్ చిత్రాలను సైతం వెనక్కి నెట్టి ఓటిటిలో దుమ్ములేపుతోంది టైగర్ నాగేశ్వర రావు. ఇక ఈ సినిమా తర్వాత సంక్రాంతికి ‘ఈగల్’ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు మాస్ రాజా. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మరి ఈ సినిమాతో మాస్ రాజా ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.