OM Bheem Bush OTT: కామెడీ సినిమాగా మంచి విజయాన్ని అందుకున్న సినిమా ఓం భీమ్ బుష్. ప్రేక్షకుల్ని హాయిగా కడుపుబ్బా నవ్వించిన ఈ సినిమా హిట్ టాక్ని సొంతం చేసుకుంది. శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా నటించిన ఈ సినిమా అనుకున్న దాని కంటే ముందుగానే ఓటీటీలోకి రానుంది. ఇది ఏప్రిల్ 19 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో(amazon prime) స్ట్రీమింగ్కి రాబోతున్నట్లు సమాచారం.
థియేటిరికల్ రిలీజ్‌కి ముందుగానే ఈ సినిమా ఓటీటీ(ott) హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈ కామెడీ మూవీ ఏప్రిల్ లాస్ట్ వీక్కి ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంటుందని తొలుత భావించారు. అయితే అందుకు భిన్నంగా ఈ మూవీ ఏప్రిల్ 19 నాటికే స్ట్రీమింగ్కి సిద్ధం అవుతోంది. అయితే అధికారికంగా దీనిపై ఇంకా ప్రకటన వెలువడలేదు. ఏప్రిల్ రెండో వారంలో దీని గురించి అధికారికంగా ప్రకటన వస్తుందని తెలుస్తోంది.
ఓం భీమ్ బుష్z9om bhim bush) సినిమాకి శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం చేశారు. హుషారు, రౌడీ బాయ్స్ తర్వాత శ్రీహర్ష డైరెక్టర్‌గా వచ్చిన మూడో చిత్రం ఇది. ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిదిన్ర కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. పది కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ఎనిమిది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా పదహారు కోట్లకు పైగా గ్రాస్‌ను, ఎనిమిదిన్నర కోట్ల వరకు షేర్ కలెక్షన్స్‌ని రాబట్టింది. బ్రేక్ ఈవెన్‌కు మరో కోటిన్నర దూరంలో నిలిచింది. శుక్రవారం విడుదలైన టిల్లు స్క్వేర్ దెబ్బకు దీని వసూళ్లు పడిపోయాని తెలుస్తోంది.