»Israel Airstrikes Near Aleppo Kill 42 Syrian Soldiers As Fighting Intensifies
Israel Attack : సిరియాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 44 మంది మృతి
హమాస్ యుద్ధం జరుగుతున్న తరుణంలో ఇజ్రాయిల్ సిరియాపై విరుచుకుపడింది. ఆ దేశం జరిపిన వైమానిక దాడిలో పలువురు సైనికులు, ప్రజలు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Israel Attack On Syria : సిరియాపై ఇజ్రాయిల్ జరిపిన భీకర వైమానిక దాడిలో 44 మంది మృతి చెందారు. సిరియాలోని అతిపెద్ద నగరమైన అలెప్పో పై ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో మృతి చెందిన వారిలో 36 మంది సైనికులేనని యుద్ధ పర్యవేక్షణ సంస్థ ఒకటి వెల్లడించింది. ఇజ్రాయిల్(ISRAEL), హమాస్ యుద్ధం(HAMAS WAR) మొదలయ్యాక సిరియా సైన్యంలో ఈ స్థాయిలో ప్రాణ నష్టం జరగడం ఇద తొలిసారి.
ఈ దాడికి సంబంధించిన వివరాలను బ్రిటన్ కేంద్రంగా పని చేస్తున్న సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ వెల్లడించింది. అలెప్పో ఎయిర్‌పోర్ట్‌కు దగ్గరలోని హెజ్బొల్లాకు చెందిన క్షిపణి నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని తెలిపింది. మృతుల్లో 36 మంది సైనికులతో పాటు ఏడుగురు హెజ్బొల్లా సభ్యులు, సిరియా పౌరులు ఉన్నారని వెల్లడించింది.
రంజాన్ పవిత్రమాసం సందర్భంగా గాజాలో కాల్పుల విరమణ పాటించాలని ఈ మధ్య ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి డిమాండ్ చేసింది. దీంతో పాటు బందీలను హమాస్ విడుదల చేయాలని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించింది. మొత్తం 15 సభ్య దేశాల్లో 14 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. అమెరికా మాత్రం ఓటింగ్‌కు దూరంగా ఉంది.