SRCL: వేములవాడలోని భీమేశ్వర సదన్‌లో సోమవారం ‘ఆపరేషన్ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా ట్రాన్స్ జెండర్లు, యాచకులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అదనపు ఎస్పీ చందయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.