»Six Months Into The War In Gaza Everyone Seems To Be Losing
War : ఇజ్రాయెల్, హమాస్ యుద్ధానికి 6నెలలు.. 33వేలు దాటిన మరణాలు
ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం ప్రారంభమై ఇప్పటికి ఆరు నెలలు పూర్తయింది. దీనిలో అపారమైన ప్రాణనష్టం జరిగింది. ఆరు నెలల కాలంలో ఇప్పటి వరకు ఏకంగా వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.
Israel Hamas War : ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం మొదలై ఆరు నెలలు పూర్తయింది. ఈ భీకర యుద్ధంలో 33 వేల మందికి పైగా మరణించారు. హమాస్‌ను( Hamas) అంతం చేసే వరకు యుద్ధాన్ని ఆపేది లేదని ఇజ్రాయెల్ చెబుతోంది. మరోవైపు గాజాలో రోజురోజుకూ పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. యుద్ధ ప్రాంతాల్లో ఉన్న సాధారణ ప్రజలు దారుణమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు.
ఇలా ఇజ్రాయెల్- హమాస్ యుద్ధానికి(Israel Hamas War) నేటితో ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా ఈ విషయమై ఇజ్రాయెల్ కొన్ని వివరాల్ని వెల్లడించింది. 500 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న హమాస్ సొరంగాల్లో చాలా వరకు ధ్వంసం చేశామని తెలిపింది. మొత్తం 13 వేల మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు వెల్లడించింది. మరోవైపు ఇప్పటి వరకు 100 మందికి పైగా బందీలు హమాస్ మిలిటెంట్ల చెరలో ఉన్నారు. గాజాలో(Gaza) 33 వేలమంది ప్రాణాలు కోల్పోవడం, స్థానికులు కనీస అవసరాలు తీరే పరిస్థితి లేకపోవడం, పాలస్తీనా సమస్యలు మొత్తం ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి.
గతేడాది అక్టోబర్ 7వ తేదీ తెల్లవారుజామున ఆపరేషన్ అల్ అక్సా స్ట్రామ్ పేరుతో హమాస్ మిలిటెంట్లు మెరుపు దాడికి పాల్పడ్డారు . దాదాపు 1200 మందిని బలిగొన్నారు. 250 మందికిపైగా బందీలుగా చేసుకుని, గాజాకు తరలించారు. దీంతో ఇజ్రాయెల్ షాక్‌కు గురైంది. వెంటనే ప్రతి దాడులు మొదలు పెట్టింది. అదే యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది.