Maa President : ఇంతకు ముందు తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఉన్న మంచు విష్ణు మరోసారి ఆ పదవికి ఎన్నికయ్యారు. ఈసారి ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ఈ మేరకు సోమవారం జరిగిన మా సర్వసభ్య సమావేశంలో సభ్యులు తీర్మానం చేశారు. తెలుగు మూవీ ఆర్టిస్ట్ నూతన భవన నిర్మాణం పూర్తయ్యేంత వరకు మంచుయే ‘మా’(MAA) అధ్యక్షుడిగా ఉండాలని వారంతా కలిసి తీర్మానించారు. ఈ విషయాన్ని ‘మా’ అసోసియేషన్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.
ఈ నేపథ్యంలో మంచు విష్ణు నేతృత్వంలోని ప్రస్తుత కమిటీ పదవీ కాలాన్ని పొడిగించాలని సభ్యులు ప్రతిపాదించారు. దీంతో మరో సారి మా ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మళ్లీ తాను ప్రెసిడెంట్‌గా ఎన్నికవ్వడం పట్ల మంచి విష్ణు సంతోషం వ్యక్తం చేశారు. అసోసియేషన్‌ని మరింత బలోపేతం చేస్తానని చెప్పారు.
వాస్తవానికి మంచు విష్ణు(MANCHU VISHNU) 2021 అక్టోబర్‌లో మొదటి సారి ‘మా’అధ్యక్షుడిగా(MAA PRESIDENT) ఎన్నికయ్యారు. అప్పుడు తన ప్రత్యర్థిగా ఉన్న ప్రకాష్ రాజ్‌పై గెలుపొందారు. తర్వాత గత ఏడాది సెప్టెంబర్‌లో మళ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఎన్నికల్ని 2024 మేకు వాయిదా వేశారు. అయితే అంతకంటే ముందే సభ్యులు ఈ మేరకు ఏకగ్రీవంగా మళ్లీ విష్ణును ఎన్నుకున్నారు. దీంతో మంచు ఫ్యాన్స్, ఇండస్ట్రీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.