ADB: నాగోబా జాతరలో భక్తుల సౌకర్యార్థం జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత న్యాయ సహాయ కేంద్రాన్ని ఇంఛార్జ్ కార్యదర్శి రాజ్యలక్ష్మి ప్రారంభించారు. పేద, బలహీన వర్గాల ప్రజలు ఈ కేంద్రం ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు పొందవచ్చని ఆమె తెలిపారు. న్యాయవాదులు జమీర్, నాగేశ్వర్ తదితరులు పాల్గొని న్యాయ చట్టాలపై భక్తులకు అవగాహన కల్పించారు.