మనుషులతో పాటు అన్ని ప్రాణులకు జీవించే హక్కు ఉందని సినీనటి రేణూ దేశాయ్ తెలిపింది. ‘మనిషిని కుక్క కరిస్తే స్పందించే వ్యవస్థలు.. రోడ్డు ప్రమాదాలు, హత్యలు, అత్యాచారాలపై ఎందుకు స్పందించడం లేదు? సమాజంలో చిన్నారులపై అత్యాచారాలు జరిగినప్పుడు ఎందుకు స్పందించరు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో ఓ గ్రామ పంచాయతీ సర్పంచ్ కుక్కలను చంపడం అమానవీయం కాదా?’ అని ప్రశ్నించింది.