BHPL: కాలేశ్వరంలోని హరిత కాకతీయ హోటల్లో రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్‌ను BHPL జిల్లా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెల్ల ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిని శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఇటీవల GP ఎన్నికల్లో మాల సామాజిక వర్గం నుంచి గెలుపొందిన సర్పంచులు, వార్డు మెంబర్లను సన్మానించే కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథగా హాజరుకావాలని కోరారు.