»Mirzapur Star Heroine In Mirzapur 3 Excited By Bold Scenes
Mirzapur: ‘మీర్జాపూర్ 3’లో స్టార్ హీరోయిన్? బోల్డ్ సీన్స్‌తో రెచ్చిపోయిందా?
మీర్జాపూర్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసవరం లేదు. ఈ సిరీస్ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. రెండు సీజన్లు కూడా ఓటిటి లవర్స్‌కి పిచ్చెక్కించాయి. ఇక ఇప్పుడు థర్డ్ సీజన్ వస్తోంది. ఇందులో బాలీవుడ్ సీనియర్ బ్యూటీ కూడా ఉందనే న్యూస్ వైరల్‌గా మారింది.
Mirazapur: ఇప్పటి వరకు ఇండియాలో వచ్చిన ఓటిటి సిరీస్‌ల లిస్ట్ తీస్తే మీర్జాపూర్ టాప్ ప్లేస్‌లో ఉంటుంది. అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ సంచలనం సృష్టించింది. డైరెక్టర్ గుర్మీత్ సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ నేపథ్యంలో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. మొదటి సీజన్ 2018లో విడుదలవగా.. 2020లో సెకండ్ సీజన్ వచ్చింది. పంకజ్ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్, శ్రియ పిల్గోంగర్, హర్షిత గౌర్ తదితరులు ఈ సిరీస్‌లో నటించారు. ఇప్పుడు సీజన్ 3 రిలీజ్‌కు రెడీ అవుతోంది. రెండు సీజన్లు ఒక ఎత్తు అయితే మూడో మరో ఎత్తు అనేలా ఉంటుందని ఇప్పటికే టాక్ నడుస్తోంది.
బూతు పదాలు, బోల్డ్ సీన్స్‌కు కెరాఫ్ అడ్రస్‌గా మీర్జాపూర్ సీజన్ 3 రాబోతోంది. అయితే.. కంటెంట్ బలంగా ఉంటుంది కాబట్టి అడల్ట్ సీన్స్ కూడా అందులో భాగంగానే కనిపిస్తాయి. అందుకే మీర్జాపూర్ లవర్స్ మూడో సీజన్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మార్చి చివరి వారంలో అమెజాన్ ప్రైమ్‌లో థర్డ్ సీజన్ స్ట్రీమింగ్కు రానుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సీనియర్ హీరో కరిష్మా కపూర్ కూడా ఈ సిరీస్‌లో నటించిందనే వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య కాస్త డోస్ పెంచిన ఈ ముదురు బ్యూటీ.. సిరీస్‌లో మరింత రెచ్చిపోవడం ఖాయమని అంటున్నారు. హీరోయిన్గా అమ్మడు చేయాల్సిందంతా చేసింది కాబట్టి.. మీర్జాపూర్లో బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయిందనే మాట వినిపిస్తోంది. ఇదే నిజమైతే.. మీర్జాపూర్ ఫ్యాన్స్‌కు పండగే.