»Skill Development Scam Case Hearing Has Been Postponed To January 23rd
Skill Scam Case: స్కిల్ స్కామ్ కేసు.. విచారణ ఈ నెల 23కి వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసు విజయవాడలోని ఏసీబీ కోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా కోర్టులో విచారణ సందర్భంగా.. అప్రూవల్ గా మారిన శిరీష్ చంద్రకాంత్ షాను విచారించేందుకు
Skill Scam Case: స్కిల్ డెవలప్మెంట్ కేసు విజయవాడలోని ఏసీబీ కోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా కోర్టులో విచారణ సందర్భంగా.. అప్రూవల్ గా మారిన శిరీష్ చంద్రకాంత్ షాను విచారించేందుకు ఇప్పటికే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను అడిగారు. ఇంకా ఈ కేసులో సీఐడీ కోర్టు సమర్పించిన పత్రాలను ఇవ్వాలని చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు కోరారు.
అయితే సీఐడీ కోర్టులో సమర్పించిన పత్రాలకు సంబంధించి పిటిషన్ దాఖలు చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులకు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు శిరీష్ చంద్రకాంత్ షా వాంగ్మూలం రికార్డును ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. ఇక, నారా చంద్రబాబు నాయుడు తరఫున న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణను కోర్టు ఈ నెల 23కి వాయిదా వేసింది.