»Movie Collections Guntur Karam Vs Hanuman Collections
Movie Collections: గుంటూరు కారం vs హనుమాన్ కలెక్షన్లు
సంక్రాంతి కానుకగా జనవరి 12న రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మహేశ్‌బాబు నటించిన గుంటూరు కారం, తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. అయితే ఈ రెండు సినిమాల కలెక్షన్లు మొదటి రోజు నుంచి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Movie Collections: సంక్రాంతి కానుకగా జనవరి 12న రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మహేశ్‌బాబు నటించిన గుంటూరు కారం, తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. అయితే ఈ రెండు సినిమాలు డిఫరెంట్ జోనర్స్. మొదటి షో నుంచి గుంటూరు కారం సినిమాకి నెగిటివ్ టాక్ రాగా.. హనుమాన్ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే రెండు సినిమాల కలెక్షన్లు మాత్రం దూసుకెళ్లిపోతున్నాయి. గుంటూరు కారం సినిమా మొదటి రోజు రూ. 82.08 కోట్లు వసూలు చేయగా.. హనుమాన్ సినిమా మొదటి రోజు రూ. 21.35 కోట్లు వసూలు చేసింది.
రెండో రోజు గుంటూరు కారం రూ.24.59 కోట్లు వసూలు చేయగా.. హనుమాన్ అదనపు ప్రీమియర్లతో కలిపి రూ.29.72 కోట్లు వసూలు చేసింది. మూడు రోజు గుంటూరు కారం రూ.22.36 కోట్లు వసూలు చేయగా.. హనుమాన్ రూ.24.16 కోట్లు వసూలు చేసింది. నాలుగో రోజు గుంటూరు కారం రూ. 21.14 కోట్లు వసూలు చేయగా.. హనుమాన్ రూ.25.63 కోట్లు వసూలు చేసింది. అయిదో రోజు గుంటూరు కారం రూ.13.92 కోట్లు వసూలు చేయగా.. హనుమాన్ రూ.19.57 కోట్లు వసూలు చేసింది. ఆరో రోజు గుంటూరు కారం రూ.9.65 కోట్లు వసూలు చేయగా.. హనుమాన్ రూ.15.40 కోట్లు వసూలు చేసింది. ఆరు రోజుల్లో గుంటూరు కారం మొత్తం రూ.173.74 కోట్లు వసూలు చేయగా.. హనుమాన్ రూ.135.83 కోట్లు వసూలు చేసింది.