rave party : ఎవరో పార్టీకి వెళితే నాకేంటి సంబంధం : మంచు లక్ష్మి
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో రేవ్ పార్టీ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయమై విలేకరులు మంచు లక్ష్మిని ప్రశ్నించగా ఆమె సీరియస్‌గా స్పందించారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..?
manchu lakshmi comments on rave party : రేవ్ పార్టీ తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో ఈ విషయమై విలేకరులు మంచు లక్ష్మిని ప్రశ్నించారు. దీంతో ఆమె ఈ విషయమై సీరియస్‌గా స్పందించారు. ‘ఎవరో రేవ్ పార్టీకి(rave party) వెళితే నాకేం సంబంధం? రేవ్ పార్టీలో ఏం జరిగిందో నాకు తెలియదు. ఆ ప్రశ్నను అడగడానికి ఇది సరైన సమయం కాదు. చాలా రోజుల తర్వాత నేను నటించిన యక్షిణి వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దాని గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఎవరో అక్కడికి వెళితే నాకేం సంబంధం. ఆ వ్యక్తులు.. వాళ్ల ప్రాబ్లం’ అంటూ స్పందించారు.
మంచు లక్షి నటించిన యక్షిణి(yekshini) అనే వెబ్ సిరీస్( web series) జూన్ 14న ఓటీటీలో స్ట్రీమింగ్కి రానుంది. ఈ వెబ్ సిరీస్‌లో మంచు లక్ష్మితోపాటు అజయ్, వేదిక ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. తేజ మార్ని దీనికి దర్శకత్వం వహించారు. ఇది డిస్నీ + హాట్ స్టార్‌లో స్ట్రీమ్ కానుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ ఈవెంట్లోనే విలేకరులు ఆమెను రేవ్ పార్టీపై ప్రశ్నించారు.
ఇక తాను ముంబయికి షిఫ్ట్ అయిన విషయాన్ని కూడా మంచు లక్ష్మి(manchu lakshmi) మీడియాతో పంచుకున్నారు. తన కెరియర్, తన కుమార్తె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తాను ముంబయికి మారానని చెప్పుపకొచ్చారు. ముందు తాను దిల్లీకి మారాలనుకున్నారట గానీ కెరీర్‌ని దృష్టిలో పెట్టుకుని ముంబయికి షిఫ్ట్ అయినట్లు మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు. హాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లో తాను నటించానని బాలీవుడ్‌కి సైతం వెళ్లాలని అనుకుంటున్నానని తెలిపారు.