Gold and Silver Rates Today : పసిడి ప్రియులకు ఇది చేదు వార్తే. బంగారం ధర నానాటికీ పెరుగుతోందే తప్ప నేల చూపులు మాత్రం చూడటం లేదు. ఒక వేళ ఒక రోజు కాస్త తగ్గినా అరకొరగా తగ్గుతోంది తప్ప, ఎంత పెరుగుతోందో అంత మాత్రం తగ్గడం లేదు. బుధవారం బంగారం మళ్లీ రూ.252 పెరిగింది. దీంతో దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 74,903కు చేరుకుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం, ప్రొద్దుటూరు, హైదరాబాద్, విజయవాడ మొదలైన చోట్ల సైతం పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.74,903 గానే కొనసాగుతోంది. ఈ ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఇవి మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్న ధరలు మాత్రమే. అలాగే నగల్ని కొనుక్కునేప్పుడు ఈ ధరలకు తోడు జీఎస్టీ, మజూరీల్లాంటివి తోడవుతాయని గమనించుకోవాలి.
ఇక దేశీయ మార్కెట్లలో వెండి ధర(Silver Rate) రూ.లక్షకు చేరువవుతున్నట్లు కనిపిస్తోంది. బుధవారం మళ్లీ దీని ధర రూ.1,038 పెరిగింది. దీంతో నేడు కేజీ వెండి ధర రూ.97,044 గా కొనసాగుతోంది. మన దగ్గర ప్రధాన నగరాలైన విశాఖపట్నం, ప్రొద్దుటూరు, హైదరాబాద్, విజయవాడలాంటి చోట్ల సైతం ఇదే ధర కొనసాగుతోంది. బంగారం, వెండి రెండూ నేటి మార్కెట్ ప్రారంభ సమయానికి పెరగడం గమనార్హం.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధరలు సైతం రోజు రోజుకూ పెరుగుతున్నాయి. బుధవారం ఆరు డాలర్లు పెరిగిన ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 2351 డాలర్లకు చేరుకుంది. ఔన్సు వెండి ధర ప్రస్తుతం 32.08 డాలర్లుగా ఉంది.