Tips To Brighten Lips : లేత గులాబీ రంగులో ఉన్న పెదువులు ముఖానికే అందాన్ని తెచ్చిపెడతాయి. అలా కాకుండా కొంత మందికి అవి నలుపు రంగులోకి వచ్చేస్తాయి. మరి కొందరికి పగుళ్లు రావడం వల్ల నిశ్చేతంగా కనిపిస్తుంటాయి. ఇలాంటి సమస్యలు ఉన్న వారు చిన్న చిన్న ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా అందమైన అదరాలను(LIPS) సొంతం చేసుకోవచ్చు. అవే ఇక్కడున్నాయి. చదివేయండి.
దోసకాయలో పెదాల నలుపును తగ్గించే కొన్ని రకాల ఔషధ గుణాలు ఉంటాయి. అందుకనే డార్క్ కలర్లో పెదవులు ఉన్నాయని అనుకునే వారు దోసకాయ ముక్కల్ని పెదవుల ఆకారంలో కత్తిరించి పెట్టుకోవాలి. అలా పది పదిహేను నిమిషాలు ఉంచిన తర్వాత తీసేయాలి. ఇలా క్రమం తప్పకుండా రోజూ చేస్తూ ఉండటం వల్ల అదరాలు తిరిగి అందమైన రంగులోకి వచ్చేస్తాయి. అలాగే చిటికెడు పసుపులో కాస్త పాలను పోసి పేస్ట్‌లా చేసి రాసుకోవడం వల్ల గులాబీ రంగు పెదవులు( PINK LIPS) మీ సొంతం అవుతాయి.
కొద్దిగా ఆలివ్ ఆయిల్‌ని తీసుకుని అందులో చక్కెర వేయండి రెండింటినీ కలిపి పెదాలపై సున్నితంగా మర్దన చేసుకోండి. ఇలా ఓ ఐదు నిమిషాలు చేసుకుంటే పెదవులపై ఉండే మృత కణాలు అన్నీ తొలగిపోతాయి. మంచి రంగులో మెరుస్తాయి. తాజా గులాబీ రేకులను తీసుకుని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదాలపై అప్లై చేసుకుని పది, పదిహేను నిమిషాల పాటు ఉంచుకోవాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. రోజూ ఇలా చేస్తూ ఉండటం వల్ల అవి నలుపుదనం తగ్గి, నిగారింపును సంతరించుకుంటాయి.