MBNR: గిరిజన లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేందుకు జరుగుతున్న కుట్రలకు నిరసనగా ఢిల్లీలో నిర్వహించనున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో నాయకులు ఇవాళ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు వెంకటరావు సోయం బాబురావుల కుట్రలను ఖండిస్తున్నామన్నారు.