KMR నాగిరెడ్డిపేట మండలంలోని జలార్పూర్, కన్నారెడ్డి గ్రామాలలో పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ సిబ్బందితో కలిసి శుక్రవారం రాత్రి దాడి చేశారు. రెండు స్థావరాల వద్ద 8 మందిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ.17,540 స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడితే చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.