Murders : కుటుంబంలో 8మందిని నరికి, తాను సూసైడ్ చేసుకున్న ఇంటి పెద్ద
కుటుంబానికి రక్షణగా నిలవాల్సిన ఓ ఇంటి పెద్దే ఆ కుటుంబ సభ్యుల పాలిట శాపంగా మారాడు. మొత్తం ఎనిమిది మందిని నరికి చంపి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగింది ఎక్కడంటే..?
Chhindwara Murder Case : ఇంటి పెద్దగా వ్యవహరించాల్సిన ఓ వ్యక్తి ఆ కుటుంబం పాలిట యముడిగా మారాడు. మానసిక సమస్యలతో బాధ పడుతున్న ఆ వ్యక్తి వరుసగా తన భార్య, తల్లి, సోదరుడు, సోదరి, మేనల్లుడు, మేనకోడళ్లను గొడ్డలితో నరికి చంపేశాడు. ఆ తర్వాత మేనమామ కొడుకు(10)పై దాడి చేస్తుండగా అతడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతూ ఇంటి పక్కన ఉన్న వారికి జరిగిన విషయం అంతా చెప్పారు.
ఈ క్రమంలో ఇలా ఎనిమిది మందిని హత్య(MURDER) చేసిన తర్వాత నిందితుడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో మధ్యప్రదేశ్లోని ఛింద్వారాలో (CHHINDWARA) ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యలు ఎందుకు చేశాడనే విషయమై వారు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నిందితుడికి మానసిక సమస్యలు ఉన్నాయి. పైగా అతడికి మే 21వ తేదీనే వివాహం జరిగింది. పెళ్లై వారం రోజులు అయ్యింది. ఈ క్రమంలో ఇంట్లో ఏమైనా గొడవలు జరిగాయా? లేదా మానసిక సమస్యలతోనే అతడు ఇన్ని హత్యలకు పాల్పడ్డాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఇలా వరుస హత్యలతో స్థానికంగా విషాదం నెలకొంది.