Minor Girl: మైనర్లను (minor) కూడా వదలడం లేదు కొందరు మృగాళ్లు. ఒంటరిగా బయట కనిపిస్తే చాలు.. కిడ్నాప్ (kidnap) చేసి అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో లైంగిక దాడుల కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కఠిన శిక్షలు వేసినప్పటికీ మృగాళ్లలో మార్పు మాత్రం రావడం లేదు. విశాఖపట్నం (vizag) జిల్లా గోపాలపట్నంలో (gopalapatnam) ఓ మైనర్ బాలికపై లైంగికదాడి జరిగింది. సదరు బాలిక ఇంట్లో నుంచి అలిగి వచ్చింది. గోపాల పట్నం మెయిన్ రోడ్డులో ఉండగా.. ఓ యువకుడు కారు (car) ఎక్కించుకుని పోయాడు. ఆమెపై లైంగికదాడికి తెగబడ్డాడు. ఆ తర్వాత ప్రహ్లాదపురంలో ఓ మహిళకు (women) బాలికను అప్పజెప్పి.. అక్కడినుంచి వెళ్లిపోయాడు.
సదరు మహిళ (women) మరో ముగ్గురు యువకుల (three men) చేత లైంగికదాడికి పాల్పడింది. ఇలా ఆ బాలిక చిత్రవధ అనుభవించింది. వారు విడిచిపెట్టడంతో బయటకు వచ్చింది. గోపాలపురం పోలీస్ స్టేషన్ (police station) వచ్చి ఫిర్యాదు చేసింది. లైంగిక దాడి ఘటనో మహిళతోపాటు మరో 8 మందిని (8 people) పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక దాడి ఘటనలో ఓ మీడియా ప్రతినిధి ఉన్నారని విశ్వసనీయంగా తెలిసింది. బాలిక కనబడటం లేదని రెండురోజుల క్రితం పేరంట్స్ (parents) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ బాలిక అత్యాచారానికి గురయ్యిందని పోలీసులు (police) చెబుతున్నారు. సదరు బాలిక దళిత (dalit) సామాజిక వర్గానికి చెందినదిగా గుర్తించారు. ఈ కేసు విచారణ కొనసాగుతోందని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు (police) చెబుతున్నారు.