Apsara: అప్సర (Apsara) హత్య కేసులో కీలక వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్లాన్ ప్రకారం సాయికృష్ణ అప్సరను ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లాడు. కోయంబత్తూరు వెళదామని చెప్పడంతో.. ఆమె అలా పేరంట్స్కు చెప్పిందట. ఫోర్డ్ కారులో సరూర్ నగర్ నుంచి బయల్దేరి రాళ్లగూడ వైపు వెళ్లారు. అక్కడే భోజనం చేసి.. కారు ఫ్రంట్ సీటులో రిలాక్స్ మోడ్‌లో ఉందట. ఆమె నిద్రపోతున్న సమయంలో.. ఇంటి నుంచి తీసుకొచ్చిన బెల్లం దంచే కర్ర తీసుకొచ్చి, తలపై దాడి చేశాడని తెలిసింది. అదే కారులో అప్సర (Apsara) మృతదేహాన్ని పెట్టి రోజంతా ఇంటిముందే పార్క్ చేశాడనే సంచలన విషయం తెలిసింది. మరుసటి రోజు మృతదేహాన్ని మ్యాన్ హోల్లో దించి.. మట్టిని నింపాడు. అక్కడ వాసన వస్తుందని అందుకే మట్టి నింపతున్నానని డ్రామా ఆడాడు.
ఇలా చేధించారు..
అప్సర (Apsara)- సాయికృష్ణ గురువారం రోజున శంషాబాద్‌లోని సుల్తాన్ పల్లికి వెళ్లగా.. పెళ్లి విషయమై గొడవ జరిగింది. అక్కడే తలపై కర్రతో దాడి చేశాడు. కారులోనే మృతదేహాన్ని తాను నివసించే సరూర్ నగర్ తీసుకువచ్చాడు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మ్యాన్ హోల్లో పడేశాడు. అక్కడి నుంచి శంషాబాద్ వచ్చి.. అప్సర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొబైల్ సిగ్నల్స్, సీసీ కెమెరా రికార్డ్ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు.
పెళ్లి చేసుకోవాలని కోరడంతోనే
సీసీ కెమెరా, మొబైల్ ట్రాక్ రికార్డ్ పరిశీలించారు. వారి మొబైల్స్ ఒకే దగ్గర ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. సాయిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం తెలిసింది. పెళ్లి చేసుకోవాలని కోరడంతో హత్య చేశానని సాయి అంగీకరించాడు. తమకు కొద్దీ రోజుల నుంచి వివాహేతర సంబంధం ఉందని చెప్పాడు. తమ సంబంధం ఎక్కడ బయట పడుతుందని హత్య చేశానని చెప్పాడు. సాయికృష్ణ, అప్సరకు సంబంధం ఉండటంతో ఇదివరకు అబార్షన్ కూడా చేయించారని తెలిసింది. రెండోసారి అబార్షన్ చేయించగా.. పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేసిందట. దీంతో హత్య చేశాడు. సాయికృష్ణకు అప్పటికే పెళ్లి అయ్యింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సాయికృష్ణ వృత్తిరీత్యా పూజారి.. కానీ ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని.. పెళ్లి చేసుకోవాలని అడిగితే కడతేర్చాడు. అప్సర తమిళనాడుకు చెందిన బ్రహ్మిన్ అమ్మాయి.