అప్సర వేధింపుల వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ధనలక్ష్మీ చెబుతున్నారు. కుమారుడు చనిపోయినప్పటీ నుంచి అప్సర, ఆమె తల్లి జాడ తెలియలేదని పేర్కొన్నారు.
Apsara’s torture: అప్సర (Apsara) మృతి కేసులో రోజుకో కొత్త అప్ డేట్ తెలుస్తోంది. అప్సరను (Apsara) హత్య చేసేందుకు పూజారి సాయికృష్ణ స్కెచ్ వేసిన విషయం తెలిసిందే. అప్సరకు అంతకుముందే పెళ్లి అయ్యిందనే విషయం వెలుగులోకి వచ్చింది. అప్సర (Apsara) మృతితో ఆమె అత్త ఆడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో అప్సర (Apsara), ఆమె తల్లి గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. వారిద్దరూ తన కుమారుడిని టార్చర్ పెట్టారని వివరించింది. అందుకే అతను సూసైడ్ చేసుకున్నాడని వాపోయింది.
అప్సర (Apsara) అత్త ధనలక్ష్మీ ఆడియో ఒకటి బయటకు వచ్చింది. అప్సరను తన కుమారుడు కార్తీక్ రాజా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని వివరించింది. పెళ్లయిన తర్వాత తన కుమారుడిని వేధించిందని.. ఒకసారి జైలుకు కూడా పంపించిందని పేర్కొంది. ఆమె టార్చర్ భరించలేకపోయాడని వివరించింది. జైలుకు పంపించడంతో తన కుమారుడు కుంగిపోయాడని చెబుతోంది. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడని.. దాంతో తాము దిక్కులేని వాళ్లం అయ్యాయని తెలిపింది. తన కుమారుడు చనిపోయిన తర్వాతి నుంచి అప్సర (Apsara), ఆమె తల్లి జాడ తెలియలేదని పేర్కొంది. అప్సర హత్య జరిగిన తర్వాత తమకు వారు సిటీలో ఉంటున్న విషయం తెలిసిందని వివరించింది.
అప్సర (Apsara) హత్య గురించి సంచలన విషయాలు తెలుస్తున్నాయి. ఆమెకు పెళ్లి అయ్యిందనే విషయం తర్వాత తెలియగా.. ఆమె భర్త సూసైడ్ చేసుకున్నాడని తెలిసింది. అప్సర (Apsara) టార్చర్ వల్లే చనిపోయాడని, అత్త చెప్పడం గమనార్హం. భర్తను వేధించి.. చనిపోయేందుకు కారణమైన అప్సర (Apsara) తర్వాత సాయితో ప్రేమాయణం నడిపింది. ఇద్దరు శారీరకంగా దగ్గర కావడం.. ప్రెగ్నెన్సీ రావడంతో పెళ్లి కోసం పట్టుబట్టింది. అప్పటికే పెళ్లై.. ఇద్దరు పిల్లలు ఉన్న సాయి (sai).. వెనకడుగు వేశాడు. అప్సర నుంచి తప్పించుకోవాలని అనుకొని.. మట్టుబెట్టాడు. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.