»Arvind Kejriwal Files New Petition In Sc Seeks Extension Of Interim Bail By Seven Days For Medical Testsrejected
Kejriwal: కేజ్రీవాల్‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు
వైద్య పరీక్షల నిమిత్తం తన బెయిల్‌ని మరో వారం రోజుల పాటు పొడిగించాలంటూ సుప్రీం కోర్టులో అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇలా మధ్యంతర బెయిల్ విచారణకు సుప్రీం నిరాకరించింది.
Give me injunctions.. Kejriwal's petition in court
Aravind Kejriwal: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఆయన దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను మీరిక్కడ చదివేయ వచ్చు. దిల్లీ సీఎం కేజ్రీవాల్( Kejriwal) మద్యం కుంభకోణం కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆ బెయిలు గడువు జూన్ 1తో ముగుస్తుంది. రెండో తారీఖున ఆయన తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంది.
కేజ్రీవాల్ ఇప్పుడు కొన్ని హెల్త్ చెకప్స్ చేయించుకుంటున్నారు. మరి కొన్ని పరీక్షలు సైతం అవసరం అని డాక్టర్ల బృందం ఆయనకు సూచించింది. దీంతో తన బెయిల్ గడువును పొడిగించాలంటూ ఆయన సుప్రీం కోర్టులో(SC) పిటిషన్‌ను(petition) దాఖలు చేశారు. మరో వారం రోజుల పాటు తన బెయిల్ గడువును పెంచాలని కోరారు. అయితే ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు విముఖత వ్యక్తం చేసింది.
జస్టిస్ ఏఎస్ ఓక్ నేతృత్వంలోని ధర్మాసనం కేజ్రీవాల్( Kejriwal) దాఖలు చేసిన మధ్యంతర బెయిల్(interim bail) పిటీషన్‌ను విచారించబోమని స్పష్టం చేసింది. ఇంత ఆలస్యంగా మళ్లీ ఎందుకు పిటిషన్ దాఖలు చేశారంటూ ప్రశ్నించింది. దీంతో కేజ్రీవాల్‌కు మరోసారి సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలినట్లు అయ్యింది.