»Voter Slip Download If The Voter Slip Did Not Come Then Do This
Voter Slip Download: ఓటర్ స్లిప్ రాలేదా.. అయితే ఇలా చేయండి!
సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటర్లు సిద్ధమయ్యారు. అయితే కొంతమంది ఓటర్ స్లిప్‌లు వస్తే మరికొందరికి రాకపోయుంటాయి. మీకు కూడా ఓటర్ స్లిప్‌లు రాకపోతే మొబైల్ నుంచి ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేలా తెలుసుకుందాం.
Voter Slip Download: If the voter slip did not come... then do this!
Voter Slip Download: ఓటరు స్లిప్ కోసం మొబైల్ బ్రౌజర్‌లోకి వెళ్లి https://electoralsearch.eci.gov.in/ లింక్ క్లిక్ చేయాలి. అప్పుడు ఇందులో 3 ఆప్షన్లు కనిపిస్తాయి. తర్వాత ఓటరు ఐడీ, మొబైల్ నెంబరు, మీ పేరు, ప్రాంతం వివరాలతో ఓటర్ డిటైల్స్ వెతకొచ్చు. దానిని డౌన్లోడ్ చేసకుని ప్రింట్ తీసుకుని ఓటు హక్కు ఉపయోగించుకోవచ్చు. అందులోనే మీ పోలింగ్ బూత్ వివరాలు కూడా ఉంటాయి. ఓటరు కార్డు వివరాలు తెలుసుకునేందుకు ఉన్న మరో అవకాశం ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో ఎలక్టోరల్ రోల్ సెర్చ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి వివరాలు ఎంటర్ చేసి ఓటర్ స్లిప్ పొందవచ్చు.
ఇందులో మొబైల్ నెంబరు, ఓటరు ఐడీ, మీ వివరాల సెర్చ్ ఆప్షన్‌తో పాటు క్యూఆర్ కోడ్ స్కాన్ ఆప్షన్ అదనంగా ఉంటుంది. ఓటర్ ఐడీ మీద క్యూఆర్ కోడ్‌ను ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా స్కాన్ చేస్తే మీకు కావాల్సిన సమాచారం వస్తుంది. అలా వచ్చిన సమాచారాన్ని వాట్సాప్, మెయిల్ ద్వారా కూడా షేర్ చేసుకోవచ్చు. ప్రింట్ తీసుకుని ఓటు హక్కు కోసం ఉపయోగించవచ్చు. మెసేజ్ ద్వారా కూడా ఓటరు సమాచారాన్ని తెలుసుకోవచ్చు. దీనికోసం 1950 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి. ఈసీఐ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటరు ఐడి టైప్ చేసి మెసేజ్ సెండ్ చేయాలి. మీకు పార్ట్ నెంబరు, సీరియల్ నెంబరు లాంటి సమాచారం మొబైల్‌కి మెసేజ్ రూపంలో వస్తుంది.