Posani Krishnamurali: Posani who made sensational comments
Posani Krishnamurali: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటలింగ్ చట్టంపై భారీ ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే తాజాగా దీనిపై పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. టైటిలింగ్ చట్టంపై వస్తున్న వార్తలను నమ్మవద్దని ప్రజలకు తెలిపారు. అందరూ అనుకున్నట్లు పేదల భూములు లాక్కుంటే తాను విజయవాడలో ఆత్మహత్య చేసుకుంటానని పోసాని పేర్కొన్నారు. తన మాటలు నమ్మి రానున్న ఎన్నికల్లో ఆలోచించి సరైన పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అయిన వంశపారపర్యంగా రైతులకు వచ్చే భూములు వాళ్లకి కాకుండా ఇంకా ఎవరికి కాకుండా పోతాయని పోసాని అన్నారు. భూమిపై పక్కా యాజమాన్యపు హక్కు కల్పించి, వారి వారసులకు అందేలా చేయడమే ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ ఉద్దేశమని అధికార పార్టీ తెలుపుతోంది.