CEO Mukesh Kumar Meena: Violation of the rules will not lead to action
CEO Mukesh Kumar Meena: ప్రభుత్వ పథకాలు ఆపమని ఎన్నికల సంఘం ఆదేశాలివ్వలేదని, కొంతకాలం తర్వాత ఇవ్వాలని చెప్పిందని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌కుమార్ మీనా తెలిపారు. ఎన్నికల్లో విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సుమారు 70 శాతం పూర్తయిందన్నారు. ఇంకా అవసరం అయితే 9వ తేదీ వరకు అవకాశం కల్పిస్తామన్నారు. సొంత నియోజకవర్గాల పరిధిలోనే ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.
కొన్నిచోట్ల 12-డి ఫారాలు అందడంలో జాప్యం జరిగిందన్నారు. కొంతమంది ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోని వాళ్లు మంగళవారం, బుధవారం ఓటు వేయవచ్చన్నారు. సెక్యూరిటీ డ్యూటీకి వెళ్లిన వాళ్లు ఈ నెల 9న కూడా అవకాశం కల్పించినట్లు తెలిపారు. కొన్ని ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఓటర్లకు డిజిటల్ పేమెంట్ చేస్తూ ప్రలోభ పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. తప్పు చేసిన వాళ్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలింగ్ సందర్భంగా అక్రమాలకు పాల్పడిన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. కాబట్టి ఉద్యోగులు నిబంధనలకు అనుగుణంగా ఉండాలన్నారు.