SRPT: సంక్రాంతి ముగ్గులు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు అని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఛైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ అన్నారు. సోమవారం కోదాడ కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పాశ్చాత్య సంస్కృతితో పండుగల ప్రాధాన్యత తగ్గిపోతుందని ఆయన అన్నారు.