గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ బుధవారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులును కలిసి నియోజకవర్గ సమస్యలపై చర్చించారు. ప్రధానంగా సంక్రాంతి సంబరాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని, నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కమిషనర్‌కు విన్నవించారు.