W. G: వివిధ ఘటనల్లో బుధవారం ఉమ్మడి ప.గో జిల్లాలో పలువురు మృతి చెందారు. పెదపాడులో పెళ్లయిన ఏడు నెలలకే జ్యోతి అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. అటు మండవల్లిలో తల్లికూతుళ్ల మరణం మిస్టరీగా మారగా, కొయ్యలగూడెంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు, చెక్ డ్యాంలో పడి మరొకరు మృత్యువాత పడ్డారు.