GNTR: తాడేపల్లి అంజిరెడ్డి కాలనీ అరటి తోటలో ఈనెల 18వ తేదీ రాత్రి ఆటో డ్రైవర్ ఇల్లచెరువు వెంకటరావు (32) హత్య కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు DSP మురళీకృష్ణ తెలిపారు. బుధవారం తాడేపల్లి పోలీస్ స్టేషన్లో వివరాలను వెల్లడించారు. బ్రహ్మానందపురానికి చెందిన వెంకటరావు అంజిరెడ్డి కాలనీకి చెందిన సాయికి ఉన్న పాతకక్షల నేపథ్యంలో హత్య చేయబడ్డాడని తెలిపారు.