KRNL: మంత్రాలయంలో అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రామానుజులు హెచ్చరించారు. తుంగభద్ర నదిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించి, ఐదు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని తదుపరి చర్యల కోసం మంత్రాలయం రెవెన్యూ అధికారి రమాదేవికి అప్పగించారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే ఊపేక్షించేది లేదని స్పష్టం చేశారు.