తనకు అధికారం, పదవుల కంటే కాంగ్రెస్లో సాధారణ కార్యకర్తగా ఉండటమే ఇష్టమని కర్ణాటక Dy.CM DK శివకుమార్ అన్నారు. 1980 నుంచి కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్నానని, అలాగే కొనసాగుతానని తెలిపారు. కాంగ్రెస్ నుంచి ప్రధాని రేసులో ప్రియాంకా గాంధీ కూడా ఉన్నారనే ప్రచారాన్ని కొట్టిపారేసిన ఆయన.. ఏ నిర్ణయమైనా సోనియా గాంధీ మార్గదర్శకత్వంలో పార్టీ అధిష్ఠానమే తీసుకుంటుందని స్పష్టంచేశారు.