అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం రాయచోటి కలెక్టరేట్లో వివిధ శాఖల పనుల పురోగతిని సమీక్షించారు. రహదారుల పనులను వేగవంతం చేసి, ప్రయాణ ఖర్చు తగ్గించాలని సూచించారు. జలజీవన్ మిషన్, వాటర్ గ్రిడ్,R&B నీటిపారుదల శాఖల మిగిలిన పనులను తక్షణమే పూర్తి చేయాలని, NH 40, 440 రహదారులు,రాయచోటి బైపాస్ రహదారి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.