NLG: పల్లెల్లో కాలంగా తిష్ట వేసిన సమస్యలు పరిష్కారం కానున్నాయి. ప్రభుత్వం చిన్న గ్రామపంచాయతీలకు ప్రత్యేక అభివృద్ధి నిధులను రూ. 5 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో చిట్యాల మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు ప్రయోజనం కలుగుతుంది. గ్రామ సభలు నిర్వహించుకుని అవసరమైన పనులకు తీర్మానాలు చేసి పెండింగ్ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.