W.G: ఆకివీడు తాలూకా ఏపీ ఎన్జీవో సంఘ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా ఛైర్మన్ ఉదిసి వెంకట పాండురంగారావు సమక్షంలో జరిగిన ఈ ఎన్నికలో అధ్యక్షుడిగా ఆర్. కృష్ణ కుమార్, కార్యదర్శిగా శ్రీనివాస్, కోశాధికారిగా ఆంజనేయులు ఎంపికయ్యారు. నూతన కమిటీని ఛైర్మన్ అభినందించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వారు తెలిపారు.