ASR: అరకులోయ మండలం సుంకరమెట్ట బాప్టిస్ట్ చర్చిలో నేడు క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు చేశారు. గిరిజన ప్రాంతంలో అతి పురాతనమైన చర్చిగా దీనికి పేరుంది. దీన్ని 1939లో గ్రామంలోని కొండపై విదేశీయులు నిర్మించారు. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. ఈ చర్చిలో శతమానం భవతి, సంక్రాంతికి వస్తున్నాం, మర్యాదరామన్న, అహనా పెళ్లంట, డార్లింగ్ ఇలా చాలా సినిమాలు చిత్రీకరించారు.