PPM: గరుగుబిల్లి పోలీస్ స్టేషన్ను పాలకొండ డీఎస్పీ రాంబాబు బుధవారం తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా రికార్డులను తనిఖీ చేసి పెండింగ్ కేసులను పరిశీలించారు. సిబ్బంది పనితీరు, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారులతో ఎలా మెలగాలి, తదితర అంశాలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా చినమేరంగి సీఐ తిరుపతిరావు, సిబ్బంది పాల్గొన్నారు.