ఉన్నావో రేప్ కేసు(2017) నిందితుడు, BSP మాజీ MLA కుల్దీప్ సెంగార్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో సోనియా, రాహుల్ గాంధీలను కలిసిన బాధితురాలు.. ‘రాహుల్ నాకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నాకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఆశ్రయమివ్వండని ఆయనను కోరాను. నిందితుడికి బెయిల్ ఇవ్వడంపై రాష్ట్రపతి, PMను కలిసి న్యాయం కోరుతా’ అని తెలిపింది.