కృష్ణా: తాడిగడప మున్సిపాలిటీ పోరంకి పరిధిలో రూ.98 లక్షల వ్యయంతో డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు కట్టుబడి ఉందని తెలిపారు. డ్రైనేజీ లేక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ పనులు చేపట్టామని, మిగిలిన రోడ్లు, డ్రైనేజీలు కూడా త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.