JGL: యాసంగి సాగుకు జగిత్యాల జిల్లాకు అవసరమైన నీటిని అందించేందుకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి సరఫరాను అధికారులు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కాకతీయ కాలువలోకి 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జోన్-1 పరిధిలోని D-5 నుంచి D-11 వరకు ఉన్న ఆయా కాలువలకు ఈ నెల 11వ తేదీ వరకు నీటిని పంపిణీ చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.