కృష్ణా: గన్నవరం రైతు బజార్లో అద్దెలు చెల్లిస్తున్న వ్యాపారులను ఎస్టేట్ ఆఫీసర్ కక్షపూరితంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అద్దె షాపుల నిర్వహణపై అవగాహన లేకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని వ్యాపారులు పేర్కొన్నారు. ఈ సమస్య తక్షణమే పరిష్కారం కాకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రి లోకేశ్, కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని వ్యాపారులు హెచ్చరించారు.