ADB: మావల పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ భూములను నకిలీ పత్రాలతో విక్రయించి మోసం చేసిన డాక్యుమెంట్ రైటర్ ఎర్లా రాజును పోలీస్ సిబ్బంది అరెస్టు చేయడం జరిగిందని ఎస్సై రాజశేఖర్ బుధవారం తెలిపారు. ఆదిలాబాద్‌కు చెందిన గాంట చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రజలు భూములను కొనుగోలు చేసే ముందు జాగ్రత్త వహించాలని సూచించారు.