HYD: సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ బసిలికా చర్చిలో క్రిస్టమస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చర్చిని దీపాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించారు. అర్ధరాత్రి ప్రార్థనలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శాంతి, ప్రేమ సందేశాన్ని పంచుకున్నారు. క్యారల్స్, ప్రత్యేక ప్రార్థనలు వేడుకలకు మరింత వైభవం తీసుకొచ్చాయి.