MNCL: మందమర్రి పట్టణం బేతెస్థ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ ప్రేమ, త్యాగం, శాంతి, మానవత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. యేసుక్రీస్తు బోధనలు సమాజానికి మార్గదర్శకాలు అన్నారు.