సాధారణంగా చాలా మంది ఉదయం ఉప్మా, ఇడ్లీ సాంబార్, పోహా, రస్కులు, సమోసా, వడ, కిచిడి వంటివి తింటారు. అయితే దీనివల్ల పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోవడంతో పాటు టైప్-2 మధుమేహానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటికి బదులు గుడ్లు, పండ్లు, గ్రీక్ యోగర్టు, పాల ఉత్పత్తులు, అవిసెగింజలు తినాలని.. వీటితో పాటు పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.