NZB: వానాకాలం సీజన్‌కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ పూర్తయింది. 32 జిల్లాల్లో 8,447 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం మొత్తం 62,14,099 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. 12,04,591 మంది రైతులకు రూ. 14,840.11 కోట్లు చెల్లించారు. ఇందులో NZB జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ప్రభుత్వం ధాన్యం సేకరణలో సమన్వయం పాటిస్తూ రైతులకు న్యాయమైన మద్దతు ధర అందించినట్లు అధికారులు తెలిపారు.