ATP: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో క్రిస్మస్ ఈవ్ వేడుకలు ఆధ్యాత్మిక శోభతో మిరిమిట్లు గొలిపాయి. శ్రీ సత్యసాయి బాబా శతాబ్ది జయంతి ఉత్సవాల వేళ, సాయి కుల్వంత్ హాల్లో 36 దేశాల నుంచి వచ్చిన విదేశీ భక్తులు కీర్తనలతో స్వామికి నీరాజనాలు అర్పించారు. 470 మందికి పైగా భక్తులు ఏకస్వరంతో ఆలపించిన ‘హల్లెలూయా’, ‘సైలెంట్ నైట్’ వంటి గీతాలు భక్తులను పరవశింపజేశాయి.